News September 3, 2025
WGL: జిపిఓ అభ్యర్థులకు ఈనెల 5న నియామక పత్రాలు

ఈనెల 5న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిపిఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా పాల్గొని, అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
Similar News
News September 4, 2025
WGL: డ్రోన్‌తో యూరియా పిచికారీ ప్రదర్శన.. పరిశీలించిన జిల్లా కలెక్టర్

గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
News September 3, 2025
వరంగల్: మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం

మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పట్టణం చింతల్ యాకూబ్ పుర ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్‌ను కలెక్టర్ సత్య శారద మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం లేకపోవడం, లైటింగ్ సమస్యలు, ప్రాంగణంలో వరదనీరు నిలవడాన్ని ఆమె గమనించారు.
News September 3, 2025
వరంగల్: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వరంగల్ పట్టణంలోని చింతల్ యఖుత్ పురలో ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థుల అభ్యాస పరిస్థితులను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు.