News October 14, 2025

WGL జిల్లా ఇన్‌ఛార్జిగా అశోక్ ముదిరాజ్

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జిలను పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న నియమించారు. ఉమ్మడి జిల్లాకు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తూ మండలాలు, గ్రామాల్లో పార్టీ కార్యవర్గాల నియామక ప్రక్రియను చేపట్టాలని ఇన్‌ఛార్జికి ఎమ్మెల్సీ సూచించారు.

Similar News

News October 14, 2025

మంచిర్యాల: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

image

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదు నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

News October 14, 2025

తోగుట: ‘పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకే పదవి దక్కుతుంది’

image

నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకులను డీసీసీకి ఎంపిక చేయడమే లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల అన్నారు. మంగళవారం తోగుట మండలంలో జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తుల స్వీకరణకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసే నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని, ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో స్థానిక నేతలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు.

News October 14, 2025

ఆదర్శ గ్రామాలలో పనులు చేపడతాం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 11, రెండో విడతలో 14 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తామన్నారు. మొదటి విడత 11 గ్రామాలకు బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో పనులను చేపట్టి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.