News December 27, 2025
WGL: టికెట్ ఇవ్వండి సారూ..?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ‘మరో ఛాన్స్ ప్లీజ్’ అంటూ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 778 ఎంపీటీసీ, 75 జడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, BRS, BJP నుంచి టికెట్లు సాధించేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సానుభూతి తమకు కలిసి వస్తుందనే నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.
Similar News
News December 30, 2025
జగిత్యాల: దివ్యాంగులకు గుడ్ న్యూస్

దివ్యాంగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి నరేష్ తెలిపారు. ఇదివరకు దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ. లక్ష వివాహ ప్రోత్సాహాన్ని అందజేసే వారన్నారు. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పరస్పర వివాహం చేసుకున్న రూ.లక్ష ప్రోత్సాహాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 30, 2025
భద్రాద్రి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో సరఫరా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటికే 38,500 ఎకరాల్లో మొక్కజొన్న, 8,750 ఎకరాల్లో వరి సాగైందని, ప్రస్తుతం వరి నాట్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News December 30, 2025
నూతన సంవత్సర వేడుకలపై SP ఆంక్షలు

అనంతపురంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా SP జగదీష్ ఆంక్షలు విధించారు. వేడుకలు రాత్రి 1 లోపు ముగించాలని ప్రకటించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయానికి మూసివేయాలని హెచ్చరించారు.


