News March 18, 2025
WGL: తగ్గిన మొక్కజొన్న.. పెరిగిన పల్లికాయ!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర మళ్లీ తగ్గింది. గతవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. సోమవారం రూ.2,280కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గి రూ. 2270 కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.7,150 పలకగా నేడు రూ.7,390కి పెరిగింది. పచ్చి పల్లికాయ సోమవారం రూ.4,400 ధర రాగా ఈరోజు రూ.4,500కి పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 18, 2025
ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్‌ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
News March 18, 2025
సిద్దిపేట: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. కావున 2020 సంవత్సరంలో LRS కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు.
News March 18, 2025
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: గొట్టిపాటి

AP: YCP తప్పిదాలతో నిర్వీర్యమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొందరు విద్యుత్ ఉద్యోగులు ఆయన్ను కలవగా సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అన్ని విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ విద్యుత్ శాఖ సేవలు వెలకట్టలేనివని ఆ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.