News March 12, 2025

WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్‌కి పసుపు రాలేదు.

Similar News

News April 15, 2026

బిక్కవోలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి ఆ పేరు వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. దీనిని పూర్వం ‘బిరుదాంకినవోలు’ అని పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని బిరుదుల ఆధారంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ శైలి శివాలయాలు, ఏకశిలా గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి ఉన్నతమైన శిల్పకళా వైభవానికి, వారి మతపరమైన ఆసక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.

News April 15, 2026

గోదావరి జిల్లాల విభజనకు 101 ఏళ్లు

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల, 1920వ దశకంలో దానిని రెండుగా విభజించాలనే ప్రతిపాదన వచ్చింది. 1925 ఏప్రిల్ 15న బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 502 ప్రకారం ఉమ్మడి జిల్లాను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. ఈ విభజనలో కాకినాడ తూర్పు గోదావరికి, ఏలూరు పశ్చిమ గోదావరికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ విభజనకు నేటితో 101ఏళ్లు పూర్తయ్యాయి.

News April 15, 2026

విశాఖ జూలో సింహం మృతి

image

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.