News March 25, 2025

WGL: తరలి వచ్చిన పత్తి.. ధర ఎంతంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులకు ధరల విషయంలో ఈరోజు స్వల్ప ఊరట లభించినట్టయింది. నిన్న (సోమవారం) క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. నేడు రూ.7045 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు భారీగా పత్తి తరలి రాగా.. కొనుగోళ్ల ప్రక్రియ సైతం జోరుగా కొనసాగుతోంది.

Similar News

News December 18, 2025

311 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్‌లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్‌సైట్: rrbcdg.gov.in/

News December 18, 2025

ఏలూరు జిల్లా యువతకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు డి.భూషణం గురువారం తెలిపారు. (PMKVY 4.O) కింద ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్ (కంప్యూటర్ హార్డ్‌వేర్) కోర్స్‌లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్ అంత కంటే ఎక్కువ ఉత్తీర్ణులైన వారు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఈనెల 30లోగా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News December 18, 2025

తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు?

image

సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. అయితే ప్రతి మూడేళ్లకోసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అదనంగా నిర్వహిస్తారు. ఆ వెంటనే దసరా నవరాత్రుల్లో, ఆశ్వయుజ మాసంలో రెండోసారి ఉత్సవాలు చేస్తారు. అయితే, రెండో ఉత్సవంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వేడుకలు ఉండవు. <<-se>>#VINAROBHAGYAMU<<>>