News October 12, 2025

WGL: తస్మాత్ జాగ్రత్త.. పాత ఫోన్లను అమ్మకండి!

image

మీ ఇంట్లో వినియోగించి వదిలేసిన పాత ఫోన్లను ప్లాస్టిక్ సామాన్లకు, మొబైల్ షాపుల్లో, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారా? అయితే మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే. వాటి ఐఎంఈఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కావున వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 12, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* కొండా దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ వివాదంపై CM రేవంత్ సీరియస్.. మేడారం పనులు పూర్తి చేయాలని ఆదేశం
* జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
* యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం
* గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్‌పై చర్యలు తీసుకోవాలని ‘మా’ అధ్యక్షుడు విష్ణుకు MLC బల్మూరి వెంకట్ విజ్ఞప్తి

News October 12, 2025

విజయవాడ: దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు

image

దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ, అమ్మవారి ఆలయంలో దసరా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో దుర్గగుడి దేవస్థానంలో వేకువ జాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్టిలో ఉంచుకుని, ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చిన దేవస్థానం EO, సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, కార్ల ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. అన్ని దర్శనం టికెట్లను రద్దు చేసి, భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు.

News October 12, 2025

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

image

తల్లాడ మండలంలోని పినపాక గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఫొటోగ్రాఫర్‌ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వైరా వైపు బైక్‌పై వెళ్తున్న కొణిజర్లకు చెందిన ఫొటోగ్రాఫర్‌ పవన్ (22)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.