News December 27, 2025

WGL: తాగి బండి నడిపిన వాళ్లు ఎంతమందో తెలుసా..?

image

వరంగల్ కమిషనరేట్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో 35,513 మంది పోలీసులకు చిక్కారు. <<18684848>>జనవరి నుంచి ఈరోజు వరకు <<>>పట్టుబడిన వారి నుంచి రూ.2.19 కోట్ల ఫైన్‌లు వసూలు చేయగా.. 887 మందికి జైలు శిక్ష పడింది. 329 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, రాంగ్ రూట్ డ్రైవ్ 9,997, సెల్ మాట్లాడుతూ నడిపిన కేసులు 14,407, సిగ్నల్ జంప్ 13,024, లెసెన్సు లేకుండా నడిపిన వాళ్లు 97,020, హెల్మెట్ లేకుండా 9,04,287 తదితర కేసులు నమోదయ్యాయి.

Similar News

News February 20, 2026

జనతా వారధిలో వినతులు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

image

బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం (విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 20, 2026

మానవపాడులో అదుపుతప్పి బోల్తా పడిన కారు.!

image

మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి వద్ద ఘోర కారు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లి వస్తుండగా, వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారు పల్టీలు కొట్టినప్పటికీ, అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News February 20, 2026

ALL TIME HIGH: ఫారెక్స్ నిల్వలు $725.72 బిలియన్లు

image

భారత ఫారెక్స్ నిల్వలు FEB 13 నాటికి $8.66bn పెరిగి ఆల్ టైం హై $725.72bnకు చేరినట్లు RBI వెల్లడించింది. కరెన్సీ అసెట్స్ (డాలర్, యూరో, పౌండ్, యెన్) $3.55bn ఎగసి $573.60bnకు చేరింది. బంగారం నిల్వల విలువ $4.99bn పెరిగి $128.46bnకు చేరుకుంది. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) $103 మిలియన్లు పెరిగి $18.92bnకు చేరాయి. IMF వద్ద దేశ నిల్వలు $19 మిలియన్లు పెరిగి $4.73bnకు చేరుకున్నాయి.