News November 7, 2025

WGL: తేజా మిర్చి రూ.14,850

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,100 ధర పలకగా.. నేడు రూ.17,200 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ.17,300 ధర వస్తే.. ఈరోజు రూ.17,200కి తగ్గింది. తేజ మిర్చి ధర నిన్న రూ.14,800 ఉంటే.. శుక్రవారం రూ.14,850 అయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News November 7, 2025

రైనా, ధవన్‌.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

image

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.

News November 7, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

News November 7, 2025

విశాఖ: ఎయిర్‌పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.