News February 20, 2025

WGL: నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కమిషనర్

image

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగిన సూచనలు చేశారు. సుందరయ్యనగర్లో సీసీ రోడ్ డ్రైన్, క్రిస్టియన్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్, చింతల్‌లో సిసి రోడ్ డ్రైన్, శాంతి నగర్‌లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.

Similar News

News July 10, 2025

పర్వతగిరి: హే మహాత్మా.. శిథిలావస్థకు గాంధీ విగ్రహం..!

image

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.

News July 9, 2025

డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్‌లో చదవాలి: కలెక్టర్

image

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్  పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

News July 9, 2025

వరంగల్: రేపు ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీలో నేషనల్ వర్క షాప్

image

వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో గురువారం భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ(DST), తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన సాంకేతిక మండలి ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల మేధో సంపత్తి హక్కుల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ తెలిపారు.