News September 4, 2025

WGL: నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

image

వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై-సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం నుండి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.

Similar News

News September 5, 2025

నిజాంసాగర్‌కు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోకి 27,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15,849 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 16.603 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రధాన కాలువ ద్వారా పొలాలకు 1,000 క్యూసెక్కులను వదులుతున్నారు.

News September 5, 2025

విచిత్ర దొంగతనం.. చికెన్ సెంటర్లో 4 కత్తులు చోరీ..

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విచిత్ర దొంగతనం జరిగింది. SI రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సల్వాజీ వెంకటసాయి నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లోకి గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చొరబడి రూ.2వేలు విలువచేసే నాలుగు కత్తులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News September 5, 2025

అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

image

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <>crda.ap.gov.in<<>>లోకి వెళ్లి 4 ఆప్షన్లలో మీకు నచ్చిన దానికి ఓటు వేయొచ్చు. ఈ వంతెన అమరావతి-హైదరాబాద్ హైవేను కలపనుంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్‌లో భాగంగా ఒక వంతెన పూర్తయింది.