News December 3, 2025
WGL: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో 564 జీపీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 5 వరకు అవకాశం ఉంది. స్క్రూటినీ 6న పూర్తి చేసి, ఉపసంహరణకు డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.
Similar News
News December 4, 2025
కండలేరు నుంచి నీటి విడుదల

కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షక ఇంజనీరు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు. జలాశయం కెపాసిటీ 60.14 టీఎంసీలు కాగా, ఎగువనుంచి 17500 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయానికి వస్తుండగా, 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలాశయం వద్ద నీటి ప్రవాహం అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.
News December 4, 2025
వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.
News December 4, 2025
సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.


