News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 3, 2025
పల్నాడు: పెదనందిపాడులో అత్యాచారం, హత్య
పెదనందిపాడులో దారుణ సంఘటన జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నిందితుడు మంజు అత్యాచారం చేసి హత్య చేశాడు. జరిగిన సంఘటనపై వృద్ధురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైని ఎస్పీ దీక్షిత, డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాస రావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు.
News February 3, 2025
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం!
అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.
News February 3, 2025
ఇంటర్ విద్యార్థినిపై తిరుపతి లెక్చరర్ అత్యాచారం
ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. ప.గో(D) కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.