News April 10, 2025
WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT
Similar News
News April 18, 2025
వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
News April 18, 2025
సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రచారం.. డైరెక్టర్ బూతు పురాణం!

తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్‌ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <
News April 18, 2025
సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.