News April 10, 2025

WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT

Similar News

News March 2, 2026

ADB: PVTGల గుర్తింపు ప్రమాణాలు ఇలా.!

image

ఆదివాసీ తెగలలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలను గుర్తించేందుకు కేంద్రం 4, 5 ప్రణాళికలో PVTG అనే ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 18 రాష్ట్రాలు, అండమాన్–నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 75 PVTGలు ఉన్నాయి. ధేబర్ కమిషన్ సూచించిన ప్రమాణాలను బట్టి ఆయా వర్గాల సాంకేతిక స్థాయి, తగ్గుతున్న లేదా స్థిరమైన జనాభా, తక్కువ అక్షరాస్యత, జీవనాధార స్థాయి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా PVTGలను నిర్ణయిస్తారు.

News March 2, 2026

పరీక్షల భయం వీడి.. ఆత్మవిశ్వాసంతో నడవండి: కలెక్టర్‌

image

ములుగు: పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, నిర్భయంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ దివాకర ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘విజయపథ సందేశం’ అవగాహన ప్రతులను ఆయన సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో అనుసరించాల్సిన 7 ముఖ్యమైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

News March 2, 2026

HYD: హోలీ వేళ వైన్ షాపులు, బార్లు బంద్

image

ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని స్పష్టం చేశారు. స్టార్ హోటళ్లు, క్లబ్‌లకు ఈ నిబంధన వర్తించదని, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.