News April 10, 2025

WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT

Similar News

News April 18, 2025

MEMU రైలు అనంతపురం వరకు..

image

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

News April 18, 2025

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గురువారం జిల్లాలోని మల్లాపూర్‌లో గరిష్ఠంగా 42.1℃ నమోదైంది. మన్నెగూడెం 41.7, గొల్లపల్లి, అల్లీపూర్ 41.5, గోధూరు, నేరెల్ల 41.2, జైన, మేడిపల్లి 41.0, రాయికల్ 40.8, వెల్గటూర్, బుద్దేష్‌పల్లి, జగ్గసాగర్ 40.6, సారంగాపూర్ 40.5, కథలాపూర్, ఐలాపూర్ 40.4, పెగడపల్లి 40.3, సిరికొండ 40.2, జగిత్యాల, కోరుట్ల, మారేడుపల్లిలో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 18, 2025

వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

image

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

error: Content is protected !!