News April 6, 2025
WGL: పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి మరోసారి తన ప్రతిభ చాటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో ఆయన శనిగపప్పుపై వివేకానందుడు, పల్లికాయపై వినాయకుడి ప్రతిమలను గీసి ఔరా అనిపించారు.
Similar News
News April 7, 2025
వరంగల్: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
News April 7, 2025
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.
News April 6, 2025
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.