News March 29, 2025

WGL: పసుపు క్వింటాకు రూ.9329

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకి రూ.29,700, సింగిల్ పట్టికి రూ.28వేలు రాగా, దీపిక మిర్చి రూ.13,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే పసుపు క్వింటాకి రూ.9,329, సూక పల్లికాయ రూ.7,500, మక్కలు (బిల్టీ) రూ.2255 ధర పలికింది.

Similar News

News March 31, 2025

SRHకు వేధింపులు.. సీఎం ఆగ్రహం

image

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

News March 31, 2025

ఆ 400 ఎకరాలపై సర్వే జరగలేదు: హెచ్‌సీయూ

image

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్‌సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.

News March 31, 2025

అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

image

విజయవాడ బాలోత్సవ భవన్‌లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!