News September 4, 2025

WGL: పసుపు క్వింటా రూ.12,356

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,290 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,100, పచ్చి పల్లికాయకు రూ.4,700 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.12,356 ధర వస్తే.. 5531 రకం మిర్చి రూ.14 వేలు ధర పలికాయని వ్యాపారులు తెలిపారు.

Similar News

News September 4, 2025

వరంగల్: రెండు రోజులుగా అత్యల్ప వర్షపాతమే

image

వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. గీసుకొండలో 2 మి.మీ, సంగెంలో 0.8 అత్యల్ప వర్షపాతం నమొదయింది. ఇక మిగతా 11 మండలాల్లో ఎక్కడా చినుకు రాలలేదు. కాగా, గురువారం ఉదయం నుంచి మబ్బు పట్టి వాతావరణం చల్లబడింది. వరంగల్ నగరంలో అక్కడక్కడా తుంపర్లు పడుతున్నాయి. గత నెలలో కురిసిన విస్తారమైన వర్సలకు చెరువులు పూర్తిగా నిండిపోయి జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది.

News September 4, 2025

వరంగల్: నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

image

అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

News September 4, 2025

WGL: డ్రోన్‌తో యూరియా పిచికారీ ప్రదర్శన.. పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.