News November 11, 2025

WGL: పాలకవర్గాలు లేక నిధుల నిలిపివేత..!

image

గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులపై ఆశలు వమ్మయ్యాయి. కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి రాష్ట్ర ఎస్ఎఫ్‌సీ నిధులు 2023 ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఉమ్మడి WGL జిల్లాలోని 1708 జీపీల్లో సుమారు రూ.70 కోట్లు ట్రెజరీల్లో నిలిచి, గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తబ్ధుగా మారాయి.

Similar News

News November 11, 2025

పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

image

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.

News November 11, 2025

విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

image

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

News November 11, 2025

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.