News January 25, 2025
WGL: పూజారి మృతి.. నిందితుడికి జీవిత ఖైదు

పూజారిపై దాడి చేయగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడంతో నిందితుడికి జీవిత ఖైదు పడింది. వరంగల్ పోచమ్మ మైదాన్ దగ్గర సాయిబాబా ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన సత్యనారాయణపై 26 అక్టోబర్ 2018న సయ్యద్ హుస్సేన్ దాడి చేశాడు. గాయపడ్డ పూజారి నవంబర్ 1న చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందాడు. ఈ క్రమంలో 6 ఏళ్ల అనంతరం నిందితుడికి వరంగల్ జిల్లా కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
Similar News
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
News September 17, 2025
ASF: యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాశ్ (32) అప్పుల బాధతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News September 17, 2025
కలకడ: హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కలకడ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ముడియంవారిపల్లె, కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్, అతని తండ్రి వెంకటరమణ, తల్లి సుబ్బమ్మపై ముడియంవారిపల్లి ప్రసాద్‌రెడ్డి, గంగిరెడ్డి, పుస్పావతి, శ్రీనివాసులురెడ్డి అతని అనుచరులు కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో నలుగురితో పాటు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.