News August 21, 2025
WGL: పెట్రోలింగ్‌లోనూ మహిళా పోలీసులు ‘తగ్గేదే లే’

సాధారణంగా రిసెప్షన్, కంప్యూటర్ ఆపరేటర్లుగా మాత్రమే పనిచేసే మహిళా పోలీసులు ఇప్పుడు అన్ని రకాల విధులను నిర్వర్తిస్తున్నారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు హనుమకొండ ఠాణా పరిధిలోని మహిళా పోలీసులు గత అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఏ విధి నిర్వహణలోనూ వెనుకడుగు వేయమని వారు నిరూపించారు. ఈ చర్య మహిళా పోలీసుల సామర్థ్యాన్ని, అంకితభావాన్ని చాటి చెబుతోంది.
Similar News
News April 13, 2026
NLG: ఒకే సీజన్‌లో రెండోసారి వాత

కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్‌లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై సుమారు 109.50 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.
News April 13, 2026
RGM: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కేసు నమోదు

అంతర్గాం మండల పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వయసు గల సమీప బంధువు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అంతర్గాం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News April 13, 2026
సెకండియర్ ఫలితాల్లో పెద్దపల్లి అమ్మాయిలు అదుర్స్..!

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా బాలికలు అదరగొట్టారు. బాలికలు 77.45% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 55.01% తో వెనుకబడ్డారు. సుమారు 22.44 శాతం ఆధిక్యంతో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం 2,226 మంది బాలికలకు గాను 1,724 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించడంపై విద్యాశాఖ హర్షం వ్యక్తం చేసింది.


