News March 25, 2026

WGL: పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు: అధికారులు

image

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు తెలిపారు. సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెప్పారు. కొన్ని బంక్‌ల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల వల్ల ప్రజలు ఆందోళనగా కొనుగోలు చేయడంతోనే ఏర్పడ్డాయని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 14, 2026

గుంటూరులో ఆలివ్ సంస్థ హోటల్ గదులు

image

ఏపీ పర్యాటక శాఖతో ఆలివ్ హాస్పిటాలిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గుంటూరు, విశాఖ, తిరుపతి, విజయవాడల్లో మొత్తం 2,000 హోటల్ గదులను నిర్మించనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 55 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా గుంటూరు సహా ఆయా నగరాల్లో దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది.

News April 14, 2026

బిహార్ కొత్త సీఎం ఇతనేనా?

image

బిహార్ కొత్త సీఎంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఎన్నిక దాదాపు ఖరారు అయింది. Dy.CMలుగా ఇద్దరు జేడీయూ నేతలు ఉండనున్నట్లు సమాచారం. ఇందులో నితీశ్ కుమారుడు నిశాంత్‌కు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవికి రిజైన్ చేయనున్న నితీశ్ కుమార్ ఆఖరి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. కాసేపట్లో ఆయన రాజీనామాను గవర్నర్‌కు అందజేయనున్నారు. నితీశ్‌కు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది.

News April 14, 2026

గుమ్మం పైన కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

image

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు.