News December 27, 2025

WGL: పెరిగిన పోక్సో కేసులు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసులు పెరిగాయి. అమ్మాయిలపై వేధింపులు గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగినట్లు పోలీస్ అధికారుల రిపోర్టు స్పష్టం చేస్తున్నాయి. 2024లో 364 కేసులు ఉండగా, 2025లో 405 కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో షీటీమ్స్ కేసుకు 2024లో 243 ఉండగా, 2025 వార్షిక సంవత్సరంలో 209 నమోదయ్యాయని <<18685054>>వార్షిక నివేదిక <<>>సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

Similar News

News December 30, 2025

2025లో శాంతి భద్రతలు ప్రశాంతం: సిద్దిపేట సీపీ

image

2025లో జిల్లా అంతటా శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని వార్షిక నివేదికలో సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు చేసిన ఫిర్యాదులను ఎటువంటి సంకోచం లేకుండా, నేరాలను నిర్లక్ష్యం చేయకుండా FIRలు స్వేచ్ఛగా నమోదు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 507 కేసులు నమోదు చేశామన్నారు.

News December 30, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్‌ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్‌ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి

News December 30, 2025

NLG: డీసీసీబీ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రైతు సంక్షేమమే DCCB ప్రధాన లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. NLGలో అధికారుల సమావేశంలో ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’పై సమీక్ష జరిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. బ్యాంకు ఆర్థిక పురోగతికి రికవరీలు ముఖ్యమని, క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా సాంకేతిక కమిటీ తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయాలన్నారు.