News January 7, 2026
WGL: పోలీసుల అదుపులో కేటుగాడు!

నగదును రెండింతలు చేస్తామంటూ బురిడీ కొట్టించిన ఓ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ORR దగ్గరలోని <<18747599>>ఫామ్ హౌజ్‌లో రూ.55 లక్షల నగదు<<>>ను పూజలు చేసి రెండింతలు చేస్తామంటూ మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు ముంబయిలో ఉన్నట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ, ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 9, 2026
గోల్డెన్ గ్లోబ్స్ 2026.. ప్రజెంటర్‌గా ప్రియాంకా చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 11న జరగబోయే 83వ Golden Globes 2026లో ఆమె ప్రజెంటర్‌గా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా అవార్డులు అందజేయనున్నారు. కామెడీ స్టార్ నిక్కీ గ్లేజర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది సినిమాలతో పాటు పాడ్‌కాస్ట్ విభాగాల్లోనూ అవార్డులు ఇవ్వనుండటం విశేషం.
News January 9, 2026
భక్తుల భద్రతలో సీసీ కెమెరాలు కీలకం: ములుగు ఎస్పీ

మేడారం జాతరకు వస్తున్న భక్తులకు భద్రత కల్పించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ సుధీర్ కేకన్ అన్నారు. వనదేవతల గద్దల పరిసరాలు, జంపన్న వాగు, మేడారం కోర్ ఏరియాలో రద్దీ నియంత్రణ కోసం సీసీ కెమెరాలను పెద్ద సంఖ్యలో అమర్చుతున్నామని చెప్పారు. సీసీ కెమెరాలను కామాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి జాతర దృశ్యాలను పరిశీలించారు.
News January 9, 2026
నా మాటలే సున్నితం.. చేతలు గట్టిగా ఉంటాయి: పవన్

AP: ప్రజలను అభద్రతాభావానికి గురిచేసేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. తన మాటలు సున్నితంగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు. ‘అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శను స్వాగతిస్తా. కానీ కులాలు, మతాల మధ్య గొడవ పెట్టాలని చూస్తే నేను వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తా. సీఎం, నాతో సహా ఎవరూ వ్యవస్థకు అతీతం కాదు. నాకు ముందుకెళ్లే ఆలోచన తప్ప ఓటమి భయం లేదు’ అని చెప్పారు.


