News January 1, 2026

WGL: పోలీసుల నిఘా ఫలితం.. కమిషనరేట్‌లో ‘సున్నా’ ప్రమాదాలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రమాదరహితంగా ముగిశాయి. పోలీసులు చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ఫలితంగా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా నమోదు కాలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, వాహనదారుల వేగానికి బ్రేక్ వేయడంతోనే ఈ విజయం సాధ్యపడింది. ముఖ్యంగా ప్రమాదకరమైన మలుపులు, ప్రధాన రహదారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పర్యవేక్షించారు.

Similar News

News January 11, 2026

నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్‌ కోసం నిరీక్షణ!

image

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

News January 11, 2026

భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

image

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

News January 11, 2026

మేడారం జాతరలో 3,199 మందితో వైద్య సేవలు

image

ఈ నెల 28 నుంచి మొదలయ్యే మేడారం శ్రీ సమ్మక్క, సారమ్మ జాతరలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి 3,199 మంది వైద్య సిబ్బంది వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 72 మంది స్పెషలిస్టులు, 42 మంది స్త్రీ వైద్య నిపుణులతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. మరో 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది షిప్ట్‌ల వారీగా 24 గంటల పాటు సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.