News April 21, 2025

WGL: ప్రారంభమైన మార్కెట్.. అధిక ధర పలికిన పత్తి

image

మూడు రోజుల సుదీర్ఘ విరమం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా భారీ ధర పలికింది. మూడు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,560 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర భారీగా పలకడంతో రైతులకు ఊరట లభించినట్లు అయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News April 21, 2025

పీసీసీఎఫ్‌గా జిల్లా వాసికి అదనపు బాధ్యతలు

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి కార్యదర్శి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి PCCF, HOFSగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన అటవి శాఖ ప్రధాన కార్యాలయం ఆర్య భవన్‌లో PCCFగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఆయన బందువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

News April 21, 2025

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో 170 మంది తొలగింపు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.

News April 21, 2025

వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

వినుకొండలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

error: Content is protected !!