News March 2, 2025

WGL: బాలికపై అత్యాచారయత్నం.. పోక్సో కేసు నమోదు

image

వరంగల్ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌కు చెందిన రాజు (50) పై పొక్సో కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం ఘటనలో కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేందుకు వచ్చిన రాజు అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతుండగా బాలిక ఏడ్చింది. దీంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News September 13, 2025

4 రోజుల్లో 27,650 టన్నుల యూరియా: తుమ్మల

image

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని ఆయన శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే శుక్రవారం 11,930 టన్నులు, ఇప్పటి వరకు మొత్తం 23,000 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

News September 13, 2025

కృష్ణా: రూ.10 కోట్ల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

image

పేద విద్యార్థులు SSC, ఇంటర్ పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ స్కూలింగ్ విధానం అక్రమార్కులకు కాసులు పండించింది. గత మూడేళ్లుగా ఉమ్మడి కృష్ణాలోని కొందరు అధికారులతో కలిసి ఓ గ్యాంగ్ ఈ దందా కొనసాగిస్తూ రూ.10 కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులకు తాజాగా ఫిర్యాదు వెళ్లగా.. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.

News September 13, 2025

రేపు విజయవాడలో సదస్సు.. హాజరుకానున్న హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్

image

బాలికల సంరక్షణపై ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలికల రక్షణ, వారిపై నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు.