News March 23, 2025

WGL: బెట్టింగ్ భూతం.. తీస్తుంది ప్రాణం!

image

ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.

Similar News

News March 24, 2025

వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 24, 2025

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

News March 24, 2025

వరంగల్: చింతకాయ దులపడానికి వెళ్లి మృతి

image

చింతచెట్టు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్ధన్నపేటలోని నీగిరిస్వామి తండాకి చెందిన నేతవత్ నిమ్మా కూలి పనులు చేస్తుంటాడు. ఇల్లందలో చింతకాయ దులపడానికి కూలికి వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు. 

error: Content is protected !!