News October 17, 2025

WGL: భారీగా పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు శుక్రవారం రైతన్నలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. రెండు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర భారీగా పడిపోయింది. నేడు క్వింటా పత్తి ధర రూ.6,860 పలికింది. మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,940, గురువారం రూ. 6,930 ధరలు పలికాయి. ధరలు పడిపోవడం అన్నదాతలను నిరాశకు గురి చేస్తున్నాయి.

Similar News

News October 18, 2025

ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.

అంబాజీపేట: హోటల్లో టిఫిన్ తిని అస్వస్థతకు గురైన కూలీలు

image

అంబాజీపేటలోని ఒక హోటల్ లో టిఫిన్లు తిన్న కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో మాచవరానికి చెందిన 12 మంది శుక్రవారం అంబాజీపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయువు వల్లే ఇలా జరిగిందని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ చేపట్టారు. పి.గన్నవరం సీఐ భీమరాజు, ఎస్ఐలు చిరంజీవి, శివకృష్ణ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.