News January 5, 2026
WGL: మండలాల్లో ప్రజావాణికి పాతర..!

ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి గ్రామాల నుంచి వినతులు ఎక్కువగా వస్తున్నాయని గత ప్రభుత్వం మండలాల్లోనూ ప్రజావాణిని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజావాణిని చేపట్టగా ఉమ్మడి WGL జిల్లాలోని పలు చోట్ల మూన్నాళ్ల ముచ్చటగా మారింది. బాధితులు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లకు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది.
Similar News
News February 18, 2026
శ్రీకాళహస్తిలో 59 జంటలకు వివాహం.!

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిగింది. స్వామి, అమ్మవార్ల కళ్యాణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు తమ వివాహాలు చేసుకున్నారు. స్వామి వారి కళ్యాణంలో వివాహం చేసుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో స్వామి అమ్మవార్లతో పాటు మొత్తం 59 జంటల వివాహం జరిగింది. కట్నం కింద రూ.2,26,476 వచ్చాయని అధికారులు తెలిపారు.
News February 18, 2026
యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ లైన్ ఇదే!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా స్టోరీ లైన్ రివీల్ అయింది. ‘ఈ చిత్రం 1940-70 మధ్య గోవా నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అందమైన సముద్ర తీరం వెనుక దాగిఉన్న నేర సామ్రాజ్యం, రక్తపాతం, వెన్నుపోట్ల చుట్టూ మూవీ సాగుతుంది. ఒక సామాన్యుడు భయంతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనేది కథ’ అని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించారు. మార్చి 19న టాక్సిక్ విడుదలవనుంది.
News February 18, 2026
40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

<


