News November 17, 2025

WGL: మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,080

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మొక్కజొన్న సోమవారం తరలివచ్చింది. అయితే, గతవారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. గతవారం మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,090 పలకగా.. ఈరోజు రూ.2,080కి చేరింది. అలాగే, దీపిక మిర్చికి రూ.18వేల ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి.

Similar News

News November 17, 2025

నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

66 ఏళ్ల రికార్డు.. ఇండియాలో ఫస్ట్ టైమ్ నమోదు!

image

నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు అనూహ్య <<18303459>>ఓటమి<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సులు పూర్తయి కనీసం ఒక్కదాంట్లోనూ 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో 12 సార్లు ఇలా జరిగింది. చివరిసారిగా 66 ఏళ్ల క్రితం ఈ తరహా రికార్డు నమోదైంది.