News March 3, 2025
WGL: మక్కలు, పల్లికాయ ధరలు ఎలా ఉన్నాయంటే?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు రూ.2,355 పలికింది. గత వారంతో పోలిస్తే మక్కల ధర తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి రూ.5,500 ధర రాగా.. సూక పల్లికాయకి రూ.7,500 ధర వచ్చింది.
Similar News
News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2025
వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494
News March 3, 2025
రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్రమంత్రిని కలుస్తా: ఎంపీ కావ్య

వరంగల్ మహానగరంలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే డివిజన్ ఏర్పాటు విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలుస్తామన్నారు. వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.