News December 6, 2025
WGL: మూడో విడతలో 16,866 నామినేషన్లు!

ఉమ్మడి జిల్లాలో 3వ విడత నామినేషన్లు ముగిసేసరికి సర్పంచ్‌కు 4,098, వార్డులకు 12,768 కలిపి 16,866 నామినేషన్లు దాఖలయ్యాయి. MHBD 169 సర్పంచ్ స్థానాలకు 1,185, 1412 వార్డులకు 3592, జనగామ 91 జీపీలకు 688, 800 వార్డులకు 1961, ములుగు 46 జీపీలకు 242, 408 వార్డులకు 950, HNK 68 జీపీలకు 514,634 వార్డులకు 1822, WGL 109 జీపీలకు 783, 946 వార్డులకు 2639, BHPL 81 జీపీలకు 686, 696 వార్డులకు 1,804 నామినేషన్లు వచ్చాయి.
Similar News
News December 6, 2025
నిఘాలో తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 6, 2025
విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.
News December 6, 2025
NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.


