News December 4, 2025

WGL: మొక్కజొన్న క్వింటాకి రూ.2,020

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935, మంగళవారం రూ.1,905, బుధవారం రూ.1,945 ధర వచ్చింది. నేడు రూ.2,020 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు నిన్న రూ.5,400 ధర రాగా, నేడు రూ.4,700 అయినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News December 6, 2025

మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

image

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

News December 6, 2025

ఖర్చు ఎంతైనా వెనకాడని అభ్యర్థులు..

image

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూమలను, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ASF జిల్లాలో చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.15 నుంచి25 లక్షలు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. పెద్ద జీపీల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. కొందరు ప్రచారంలో పాల్గొనే వారికి రోజుకు రూ.500 చొప్పున కూలి కట్టి ఇస్తున్నారు.

News December 6, 2025

కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

image

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్‌లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.