News March 17, 2026
WGL: రంజాన్ తోఫాలు 10,250!

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,250 కిట్లను పంపిణీ చేయనున్నారు. వరంగల్‌కు 3 వేలు, హనుమకొండ 2,500, జనగామ 2 వేలు, మహబూబాబాద్ 1,250, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 750 చొప్పున కిట్లు కేటాయించారు. స్థానిక మసీదు కమిటీల ఆధ్వర్యంలో వీటిని అందజేయనున్నారు.
Similar News
News March 17, 2026
ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఫిఫా అదిరిపోయే గిఫ్ట్

2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే టోర్నీలో ప్రతి మ్యాచ్ మొదటి 10 నిమిషాలను బ్రాడ్‌కాస్టర్లు తమ యూట్యూబ్ ఛానల్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఫిఫా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా కొన్ని సెలక్టెడ్ మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ఫ్రీగా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి WC అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుంది.
News March 17, 2026
GWL: జోగులాంబ జోన్ సాధించిన పథకాలు ఇలా..!

జోగుళాంబ జోన్ పోలీసులు సాధించిన పథకాలు ఇలా.. గద్వాల జిల్లా: 4 బంగారు, 7 కాంస్య మొత్తం 11.MBNR జిల్లా: 2 బంగారు, 3 వెండి, 5 కాంస్యం మొత్తం 10.NGKL జిల్లా: 2 బంగారు,1 వెండి మొత్తం 3.వనపర్తి జిల్లా: 5 బంగారు, 6 వెండి, 4 కాంస్య మొత్తం 15. NRPT జిల్లా: 1 బంగారు పథకం, మిక్స్‌డ్ ఈవెంట్స్: 4 కాంస్య పతకాలు సాధించినట్లు జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
News March 17, 2026
మచిలీపట్నం – విజయవాడ హైవేపై LED లైట్లు: కలెక్టర్

మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై లైట్లు (వీధి దీపాలు) సరిగ్గా వెలగకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం కృష్ణా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సోడియం వ్యాపర్ లైట్ల స్థానంలో LED లైట్లు లేదా సౌర శక్తితో వెలిగే లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.


