News April 16, 2025
WGL: రూ.115 పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర భారీగా తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7450 పలకగా.. నేడు రూ.7325కి పడిపోయింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.115 ధర పడిపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా వ్యాపారులు, అధికారులు సహకరించాలని అన్నదాతలు కోరుతున్నారు.
Similar News
News December 31, 2025
న్యూ ఇయర్: డ్రగ్స్ కనిపిస్తే ఈ నంబరులో ఫిర్యాదు చేయండి

విశాఖలో నూతన సంవత్సర వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈవెంట్లలో అశ్లీలత, మాదకద్రవ్యాలకు తావులేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, 45 డెసిబెల్స్ లోపు శబ్దం, మైనర్లకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. డ్రగ్స్ పట్ల ‘జీరో టాలరెన్స్’ పాటిస్తామని, ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే 7995095799 లేదా 1972 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 31, 2025
న్యూ ఇయర్.. రేపు రిలీజయ్యే సినిమాలివే

న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రేపు పలు చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. నందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’, అవినాశ్, సిమ్రాన్ చౌదరి, నందు కీలక పాత్రలు పోషించిన ‘వనవీర’, రామ్ కిరణ్&మేఘ ఆకాశ్ ‘సఃకుటుంబానాం’తో పాటు శివరాజ్ కుమార్&ఉపేంద్ర ’45’, కిచ్చా సుదీప్ ‘మార్క్’, ఆశిక రంగనాథ్ నటించిన ‘గత వైభవం’ రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్తున్నారు?
News December 31, 2025
మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


