News December 10, 2025
WGL: రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్వెజ్ భోజనాలతో దావత్‌లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది. ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు అయ్యే వీలున్నట్లు అంచనా.
Similar News
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
మాజీ సైనికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మాజీ సైనికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా మాజీ సైనికులు, వారి వితంతువులకు పింఛను నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి, పింఛను అవగాహనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు.
News December 12, 2025
NTR: గ్యాస్ కనెక్షన్ ఇచ్చి డబ్బులు వసూళ్లు.. జిల్లాలో అధిక ఫిర్యాదులు

NTR జిల్లాలో ఉచిత గ్యాస్ పంపిణీ చేసిన తర్వాత లబ్దిదారుల నుంచి రూ.50-రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం IVRS కాల్స్‌లో స్పష్టం కాగా.. NTR జిల్లాలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఇష్టపూర్వకంగానే వారికి తోచినంత డబ్బులు ఇస్తున్నారని, ఎవరూ డిమాండ్ చేయట్లేదని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు.


