News December 3, 2025

WGL: రెబల్స్‌ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.

Similar News

News December 15, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

News December 15, 2025

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మృతి

image

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ రైనర్ (78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ (68) దారుణ హత్యకు గురయ్యారు. US లాస్ ఏంజెలిస్‌‌లోని వారి ఇంట్లో రక్తపుమడుగులో పడి కనిపించారు. సొంత కుమారుడే వారిని చంపారని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. నటుడిగా ఆయన రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. దర్శకుడిగా ‘When Harry Met Sally’, ‘Misery’, ‘A Few Good Men’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు.

News December 15, 2025

వరంగల్: ఇక ప్రాదేశిక స్థానాలపై కన్ను..!

image

జిల్లాలో రెండు విడుతల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, నాయకులు ప్రాదేశిక స్థానాలపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలను చేపట్టారు. ప్రాదేశిక స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.