News October 26, 2025
WGL: లక్కు ఎవరికైనా.. కిక్కు అందరికీ ఉండాలి..!

మద్యం షాపులకు లక్కీ డ్రా సమయం మరో 24 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటికే సిండికేట్‌గా మారి టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. లైసెన్స్ దక్కిన వ్యక్తులు చేజారకుండా న్యాయపరంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు తమ మహిళల పేరుపై దరఖాస్తులు చేశారు. లక్కు ఎవరికైనా కిక్కు మాత్రం అందరికీ ఉండాలని, చేజారితే చిక్కులు తప్పవంటున్నారు.
Similar News
News October 28, 2025
కురుమూర్తి స్వామివారి పాదుకలను చూడండి.!

కురుమూర్తి స్వామివారి ఉద్దాల (పాదుకలు) ఊరేగింపు మధ్యాహ్నం చిన్న వడ్డేమాన్ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఉద్దాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగనుంది. సాయంత్రం పాదుకలను కొండపైని ఉద్దాల మండపంలో ఉంచుతారు.
News October 28, 2025
మూడోసారీ అధ్యక్షుడు కావాలనుంది: ట్రంప్

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.
News October 28, 2025
కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.


