News April 1, 2024
WGL: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.
Similar News
News January 14, 2025
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
News January 14, 2025
ఐనవోలు జాతరలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం
ఐనవోలు జాతరలో కొత్త ఆర్టీసీ బస్సును వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భానుకిరణ్ ప్రారంభించారు. జాతరలోని తాత్కాలిక బస్ పాయింట్ వద్ద మంగళవారం హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని బస్సును ప్రారంభించారు. మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి, వరంగల్ కు సుమారు 500 ట్రిప్పుల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
News January 14, 2025
జనగామ: హత్య కేసులో నిందితుల ARREST
హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.