News March 7, 2025

WGL: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 9, 2025

వరంగల్: లోక్ అదాలత్‌లో 17,542 కేసులు పరిష్కారం

image

వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో శనివారం ఈ ఏడాది మొదటి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మల గీతాంబ, సీఎహ్.రమేశ్ బాబు పాల్గొని వివిధ కోర్టుల నుంచి 17 బేంచిలను ఏర్పాటు చేసి మొత్తం 17,542 కేసులు పరిష్కరించారని తెలిపారు. అనంతరం కేసులు ఉన్నవారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

News March 8, 2025

మహిళా దినోత్సవ వేడుకల్లో ఓరుగల్లు జిల్లా మహిళామణులు

image

మహిళల అభివృద్ధి దేశ పురోగతి సాధ్యమవుతుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మానవునిగా ఆలోచిస్తే మహిళ, పురుష లింగ అసమానత్వం ఉండదని, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన జరగదని కలెక్టర్ అన్నారు.

News March 8, 2025

రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందజేత

image

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతూ ఎంపి కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ORR చుట్టూ అలైన్‌మెంట్‌ చేయాలని కోరారు.

error: Content is protected !!