News December 26, 2025
WGL: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

జిల్లాలోని చెన్నారావుపేట మండలం లింగాపురంలో పల్నాటి సబిత (35) విద్యుత్ షాక్‌తో శుక్రవారం మరణించారు. తాను నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతుండగా, విద్యుత్ మోటర్ ఆగిపోయింది. దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సబిత భర్త లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 9, 2026
దైవాన్ని ఎలా నమస్కరించాలంటే?

గుడికి వెళ్లినప్పుడు దేవుడికి ఎలా నమస్కరించాలో శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. చాలామంది గర్భాలయంలోని మూలమూర్తికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఒక పక్కకు నిలబడే వేడుకోవాలి. గర్భాలయంలో అర్చకులు కుడివైపున ఉండి పూజలు చేస్తారు కాబట్టి, భక్తులు ఎడమ పక్కన నిలబడిటం మంచిది. అలాగే స్వామికి ఎదురుగా ఉండే నంది, గరుత్మంతుడికి మధ్యలో అడ్డుగా నిలబడకూడదని పండితులు చెబుతుంటారు.
News January 9, 2026
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
జనగామ: ప్రభుత్వ ఖజానాకు రూ.8 లక్షల గండి!

జిల్లాలో 10 డాక్యుమెంట్లలో రూ.8 లక్షలకు పైగా ప్రభుత్వ ఖజానాకు మీ సేవా సెంటర్లు కుచ్చు టోపీ పెట్టారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో యథేచ్ఛగా కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది. ఓ జర్నలిస్టుకు చెందిన డాక్యుమెంట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని జిల్లాల్లోనూ <<18805930>>ఇదే తరహాలో మోసాలు <<>>జరిగాయని పోలీసులు చెబుతున్నారు.


