News March 5, 2025

WGL: శిరీష హత్య కేసులో కీలక మలుపు

image

HYD మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 14, 2025

నల్లబెల్లి ఆసక్తికర పోరు.. తల్లిపై కూతురు విజయం

image

వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

News December 14, 2025

శివాజీ నగర్‌‌ సర్పంచ్‌గా సుక్కినే నాగరాజు

image

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొంటున్నారు.

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.