News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.
Similar News
News March 4, 2025
డీజేలు పెడితే జైలుకే: వరంగల్ ఏసీపీ

వరంగల్ నగర ప్రజలకు ఏసీపీ నందిరం నాయక్ కీలక సూచనలు చేశారు. వివాహ, ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DJలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్, SSC, ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపు, ఇతర వేడుకల్లో DJ సౌండ్స్ పెట్టి విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దన్నారు. DJ ఆపరేటర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.
News March 4, 2025
దొంగలు అరెస్ట్.. రూ.5.86 లక్షలు స్వాధీనం

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొన్ని రోజుల క్రితం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు నగదును దోచుకెళ్లారు. ఏసీపీ నరసయ్య కథనం ప్రకారం.. సోమవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జాడి శ్రీకాంత్(24),కోడెం గణేష్(24)లు చూసి పారిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి రూ.5,86,000 నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
News March 4, 2025
నర్సంపేట: ఇద్దరికి జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26వ తేదీన ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన అరవింద్, నర్సంపేట పట్టణానికి చెందిన నాగరాజు పట్టుబడ్డారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరు పర్చగా మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ తీర్పు ఇచ్చారు.