News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.
Similar News
News March 4, 2025
VKB: 153 వాహనాలు సీజ్.. రూ.46,62,375 టాక్స్ వసూలు

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో ఫిబ్రవరి 2025 సంవత్సరం ఒక్క నెలకి గాను ట్యాక్స్ చెల్లించని 153 వాహనాలను సీజ్ చేసి రూ.46,62,375 రూపాయల జరిమానాను ఒక్క నెలలోనే వసూలు చేసినట్లు వికారాబాద్ జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంకా ట్యాక్స్ చెల్లించని వాహనదారులు ఆన్‌లైన్‌లో లేదా మీసేవా ద్వారా ట్యాక్స్ చెల్లించాలని ఆయన తెలిపారు. ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
News March 4, 2025
అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.
News March 4, 2025
సంగారెడ్డి: రోబోటిక్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న మినీ శిల్పారామం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో జిల్లా నుంచి ఏడు పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 11 పాఠశాలలు పాల్గొనగా ఏడు పాఠశాల విద్యార్థులు డైమండ్ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.