News July 27, 2024

WGL: సంపాదనలో మనోళ్లు వెనకబడ్డారు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే వరంగల్ వాసుల ఆదాయం తక్కువగా ఉంది. ఈ విషయంలో హనుమకొండ జిల్లా అట్టడుగునా ఉంది. ఆదాయంలో భూపాలపల్లి, ములుగు కొంత మెరుగ్గా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున నెలకు రూ.22,629 సంపాదిస్తే.. హనుమకొండలో రూ.15,563 మాత్రమే సంపాదిస్తున్నారు.

Similar News

News December 28, 2025

WGL: ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో నగర అభివృద్ధికి బలమైన బాటలు పడతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 27, 2025

వరంగల్‌లో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

వరంగల్ నగరంలో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకు 400 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్లాంట్ ఎంతో అవసరమన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాక, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె వివరించారు.

News December 27, 2025

WGL: గ్రామ పాలనలో మహిళా శక్తి!

image

జీపీ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలో 316 జీపీలకు ఎన్నికలు జరగగా 158 మంది మహిళలు సర్పంచులుగా గెలిచారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళామణులు తమ సత్తా చాటుకున్నారు. ఇక సర్పంచ్ స్థానాల్లో మగవారు నిలిచిన చోట ఉప సర్పంచ్ మహిళలకు, మహిళలు ఉన్న చోట మగవారికి అవకాశం వచ్చింది. పాలనపై పట్టులేకున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు గ్రామాభివృద్ధి బాధ్యతను మోస్తామని మహిళా సర్పంచులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.