News December 1, 2025
WGL: ‘సమాచార’ శాఖలో సమాచారం కొరత!

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా ఉమ్మడి WGL జిల్లాలో జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఎవరికి వారే యమూనా తీరే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల డేటాను కొందరు అధికారుల అప్ అండ్ డౌన్‌ల కారణంగా చేరడంలో ఆలస్యం అవుతోంది. కలెక్టర్లకు, సమాచార శాఖ మధ్య గ్యాప్ ఉండడంతో ఈ సమస్య అందరి మీద పడుతోంది. ఏడీ, డీడీలు లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
Similar News
News December 4, 2025
వరంగల్: పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర మహాసభలు వాయిదా..!

డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా 2026 జనవరి 5, 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తెలిపారు.
News December 4, 2025
సూర్యపేట: పొగమంచులో జాగ్రత్త.. వాహనదారులకు ఎస్పీ హెచ్చరిక

సూర్యపేట జిల్లాలో చలి, పొగమంచు తీవ్రత పెరిగింది. గత ఐదేళ్లలో మంచు కారణంగా 77 ప్రమాదాలు జరిగి 34 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ నరసింహ వాహనదారులను అప్రమత్తం చేశారు. లైటింగ్ కండిషన్ సరిచూసుకోవాలని, తక్కువ వేగంతో, ఒకే లైన్‌లో డ్రైవ్ చేయాలని, ఓవర్ టేక్, మ్యూజిక్ మానుకోవాలని ఆయన సూచించారు. సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News December 4, 2025
రైల్వే నాణ్యతపై ప్రయాణికులు సంతృప్తి!

భారతీయ రైల్వే ఏటా 58కోట్ల ప్యాక్డ్ మీల్స్‌ను ప్యాసింజర్స్‌కు అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో నాణ్యతపై అందిన ఫిర్యాదులు 0.0008 శాతమేనని పేర్కొంది. వీటిపై విచారణ జరిపి గత నాలుగేళ్లలో రూ.2.8కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. నాణ్యమైన ఆహారం అందించడానికి రైల్వే నిరంతరంగా కృషి చేస్తుందని స్పష్టం చేసింది. అయితే SMలో మాత్రం ఆహార నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.


