News December 24, 2025
WGL: సర్పంచ్ రిజల్ట్స్.. ఆ ముగ్గురిపై సీఎం గుస్సా?

పంచాయతీ ఎన్నికల్లో విఫలమైన MLAలకు సీఎం రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేశ్ గౌడ్ క్లాస్ తీసుకున్నట్లు టాక్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురికి గట్టిగానే డోస్ పడినట్టు సమాచారం. ఓ MLA, రాష్ట్రనేత ఇలాకాలో భారీగా పంచాయతీలు BRSగెలవడంతో గుస్సా అయినట్టు తెలుస్తోంది. మరో యువMLAతోపాటు శివారు నేత పరిధిలో సైతం ఇదే తరహాలో ఫలితాలు రావడంతో అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగానే క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News February 21, 2026
వెయ్యేళ్ల నాటి సమాధిలో బంగారం, పెయింటింగ్స్

పనామాలోని ఎల్ కానో సైట్‌లో వెయ్యేళ్లకు పైబడిన పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 800-1000AD మధ్య దీన్ని నిర్మించినట్లు లీడ్ రీసెర్చర్ వెల్లడించారు. అక్కడ మానవ అవశేషాలు, సిరామిక్ కళాఖండాలతోపాటు బంగారం కూడా ఉందని తెలిపారు. ‘మృతదేహానికి రెండు కంకణాలు, చెవి పోగులు, ఛాతీ ఆభరణాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇతను సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు అక్కన్నపేట వాసి

అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు పులికాశీ వంశీకృష్ణ తెలంగాణ సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాడు. గ్రామానికి చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
News February 21, 2026
సిద్దిపేట: ‘అర్రైవ్ అలైవ్’తో ట్రాఫిక్ చైతన్యం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అర్రైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు రూపొందించి@Siddipet_Police_Commissionerate ను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ్ తెలిపారు.


