News October 29, 2025

WGL: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

image

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవల వారు పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా, ఎటువంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.

Similar News

News October 29, 2025

మెదక్: అమరుడికి నివాళులర్పించిన అదనపు ఎస్పీ

image

మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్న అమరుడు ఆబేద్ హుస్సేన్ కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఈరోజు పరామర్శించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పై బాంబు దాడిలో మృతిచెందిన ఆబేద్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మహేందర్ హామీ ఇచ్చారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ పాల్గొన్నారు.

News October 29, 2025

జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాస్ట్ పాలి‘ట్రిక్స్’..!

image

జూబ్లీహిల్స్‌ గెలుపుకోసం కాస్ట్ ఓటింగ్‌పై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలు, కమ్మవారి ఓట్లు 22,746, రెడ్డిలు 17,641, లంబాడీలు 11,364, క్రిస్టియన్లు 19,396 మంది, ఎస్సీలు 28,350 మంది ఉన్నట్లు సమాచారం. ఏపీలో వర్కౌట్ అయ్యే కాస్ట్ పాలి‘ట్రిక్స్’ మన దగ్గర అమలవుతుందో చూడాలి.

News October 29, 2025

మోంతా ఎఫెక్ట్.. వర్షపాత వివరాలు ఇలా

image

జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. భువనగిరి 2.4 మిమీ, వలిగొండ 18.6, నారాయణపూర్ 19.6, చౌటుప్పల్ 16, పోచంపల్లి 16.4, ఆత్మకూరు 11.2, మోత్కూరు 12.4, అడ్డగూడూర్ 11.2, గుండాల 9.6, బొమ్మలరామారం 6.2, యాదగిరిగుట్ట 4, మోటకొండూరు 7.2, ఆలేరు 4.4, రాజపేట 2, తుర్కపల్లి 5.6 మిమీ వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా నారాయణపురంలో నమోదైంది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.